భారతదేశం, మే 12 -- కొంతకాలంగా తమిళ స్టార్ హీరో విశాల్ అనారోగ్యంపై వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆయన హెల్త్ సరిగ్గా లేదని తెలిసిందే. తాజాగా విశాల్ స్టేజీపైనే కుప్పకూలడం కలకలం రేపింది. తమిళనాడులో ఓ ప్రోగ్రామ్ కు అటెండ్ అయిన ఈ హీరో ఒక్కసారిగా స్పృహతప్పి పడిపోయారు. వెంటనే ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్యంపై తాజా అప్‌డేట్‌ వచ్చింది.

విల్లుపురంలోని కూవగం కూతాండవర్ టెంపుల్ ఫెస్టివల్ సందర్భంగా సౌత్ ఇండియా ట్రాన్స్జెండర్ ఫెడరేషన్ తరఫున ఈవెంట్ నిర్వహించారు. విల్లుపురంలోని కొత్త బస్టాండ్ సమీపంలోని మున్సిపల్ గ్రౌండ్లో మిస్ ట్రాన్స్జెండర్ బ్యూటీ కాంటెస్ట్ జరిగింది.ఈ కార్యక్రమంలో నటుడు విశాల్, మాజీ మంత్రి పొన్ముడి ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు.

వేదికపై మాట్లాడి ఫోటోలు తీస్తున్న సమయంలో విశాల్ అకస్మాత్తుగా స్పృహతప్పి కింద పడిపోయారు. దీంతో షాక్ కు గ...