భారతదేశం, మే 11 -- మలయాళ సూపర్ స్టార్ మోహన్‍లాల్‍ హీరోగా 1971: బియాండ్ బార్డర్స్ అనే చిత్రం వచ్చింది. ఈ మూవీలో తెలుగు యంగ్ హీరో అల్లు శిరీష్ కూడా ఓ ముఖ్యమైన పాత్ర పోషించారు. ఈ సినిమా 2017లో మలయాళంలో థియేటర్లలో రిలీజైంది. 1971లో జరిగిన భారత్, పాకిస్థాన్ యుద్ధం ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఈ మూవీ ఆశించిన రిజల్ట్ అందుకుంది. ఈ చిత్రానికి మేజర్ రవి దర్శకత్వం వహించారు. 1971: బియాండ్ బార్డర్స్ సినిమా తెలుగు డబ్బింగ్‍లో యుద్ధ భూమి పేరుతో ఉంది.

1971: బియాండ్ బార్డర్స్ సినిమా తెలుగు డబ్బింగ్‍లో యుద్ధభూమి పేరుతో యూట్యూబ్‍లో అందుబాటులో ఉంది. భవానీహెచ్‍డీ మూవీస్ అనే యూట్యూబ్ ఛానెల్‍లో యుద్ధభూమి సినిమా ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీని ఉచితంగా చూసేయవచ్చు.

1971: బియాండ్ బార్డర్స్ (యుద్ధభూమి) సినిమాలో కల్నల్ మహదేవన్ పాత్రలో మోహన్‍లాల్ నటించారు. మరో క్యారెక్టర్...