భారతదేశం, ఏప్రిల్ 25 -- సీనియ‌ర్ హీరో అర్జున్ స‌ర్జా ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన మ‌ల‌యాళం మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీ విరున్ను ఓటీటీలోకి వ‌చ్చింది. ఒకే రోజు రెండు ఓటీటీల‌లో ఈ మూవీ రిలీజైంది. అమెజాన్ ప్రైమ్‌తో పాటు మ‌నోర‌మా మ్యాక్స్ ప్లాట్‌ఫామ్‌ల‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. థియేట‌ర్ల‌లో రిలీజైన ఎనిమిది నెల‌ల త‌ర్వాత ఈ మూవీ ఓటీటీలోకి రావ‌డం గ‌మ‌నార్హం.

విరున్ను మూవీలో నిక్కీ గ‌ల్రానీ, సోనా నాయ‌ర్ కీల‌క పాత్ర‌లు పోషించారు. ఈ యాక్ష‌న్ డ్రామా మూవీకి క‌న్న‌న్‌తామ‌ర‌కులం ద‌ర్శ‌ఖ‌త్వం వ‌హించాడు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఏక‌కాలంలో బైలింగ్వ‌ల్ మూవీగా విరున్ను తెర‌కెక్కింది. త‌మిళంలో విరుంధు పేరుతో ఈ మూవీ రిలీజైంది. కొన్ని ట్విస్ట్‌ల‌ను ద‌ర్శ‌కుడు బాగానే రాసుకున్నా ఆశించిన స్థాయిలో ఈ మూవీ మాత్రం విజ‌యాన్ని ద‌క్కించుకోలేక‌పోయింది.

జాన్ క‌థాలి...