Hyderabad, జూన్ 25 -- హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ హారర్ ఫ్రాంఛైజీ ఫైనల్ డెస్టినేషన్ నుంచి వచ్చిన ఆరో మూవీ ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్‌లైన్స్. ఈ సినిమా గత నెల 16న థియేటర్లలో రిలీజ్ కాగా.. బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.2400 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా తెలుగులోనూ రిలీజైంది. ఇప్పుడు ఒకేరోజు రెండు ఓటీటీల్లోకి స్ట్రీమింగ్ కు వచ్చింది.

ఫైనల్ డెస్టినేషన్ ఫ్రాంఛైజీ నుంచి వచ్చిన ఆరో సినిమా బ్లడ్‌లైన్స్. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోతోపాటు బుక్ మై షో స్ట్రీమ్ ప్లాట్‌ఫామ్స్ లోకి స్ట్రీమింగ్ కు వచ్చింది. ఇంగ్లిష్ తోపాటు తెలుగు, పలు ఇతర భాషల్లో చూడొచ్చు. అయితే ఈ సినిమాను చూడాలంటే మాత్రం రెంట్ చెల్లించాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతానికి ఫ్రీగా అందుబాటులోకి రాలేదు.

ఈ ఎ రేటెడ్ హారర్ మూవీ చూడాలంటే మాత్రం ఏకంగా రూ.499 చెల్లించాల్సిందే. ఇది చాలా ఎక్కువే అని ...