భారతదేశం, డిసెంబర్ 10 -- ఓటీటీలోకి ఈ వారం కొత్త సినిమాలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ లిస్ట్ లో తమిళ రొమాంటిక్ కామెడీ మూవీ చేరింది. అదే.. 'ఆరోమలే'. ఈ తమిళ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను ఇవాళ అనౌన్స్ చేశారు. ఇందులో సీనియర్ హీరో రాజశేఖర్ కూతురు శివాత్మిక రాజశేఖర్ హీరోయిన్.

తమిళ రొమాంటిక్ కామెడీ ఆరోమలే ఓటీటీలో అడుగుపెట్టనుంది. కిషన్ దాస్, శివాత్మిక రాజశేఖర్ జంటగా నటించిన ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు రెడీ అయింది. ఈ చిత్రం పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియోహాట్‌స్టార్‌లోకి రానుంది. డిసెంబర్ 12 నుంచి డిజిటల్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేయనుంది.

మరోవైపు ఇండియా బయట ఉన్న ఎన్ఆర్ఐల కోసం ఈ మూవీ సింప్లీ సౌత్ ఓటీటీలోకి రాబోతుంది. ఈ ఓటీటీలో ఇండియా బయట ఉన్న దేశాల్లోని ఆడియన్స్ ఆరోమలే మూవీని చూసే ఛాన్స్ ఉంది.

ఆరోమలే సినిమా తెలుగులోనూ ఓటీటీలో రిలీజ్ అవుతుంద...