భారతదేశం, మే 10 -- తెలుగు సినిమాలు మెర్సీ కిల్లింగ్‌, క‌ర్ణ పిశాచి ఓటీటీలోకి వ‌చ్చాయి. శ‌నివారం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ రెండు సినిమాలు రిలీజ‌య్యాయి. మెర్సీ కిల్లింగ్ క్రైమ్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో తెర‌కెక్క‌గా...క‌ర్ణ పిశాచి హార‌ర్ క‌థాంశంతో రూపొందింది.

క్రైమ్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో రూపొందిన మెర్సీ కిల్లింగ్‌లో సాయికుమార్‌, కేరింత పార్వ‌తీశం, ఐశ్వ‌ర్య, హారిక కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. సూర‌ప‌ల్లి వెంక‌ట ర‌మ‌ణ ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. అమెజాన్ ప్రైమ్‌తో పాటు ఆహా ఓటీటీలోనూ ఈ మూవీ అందుబాటులో ఉంది.

రాజ్యాంగంలోకి అర్టిక‌ల్ నంబ‌ర్ 21 ఆధారంగా మెర్సీ కిల్లింగ్ మూవీ రూపొందింది. గ‌త ఏడాది ఏప్రిల్‌లో ఈ సినిమా థియేట‌ర్ల‌లో రిలీజైంది. ఐఎమ్‌డీబీలో 8.7 రేటింగ్‌ను సొంతం చేసుకున్న‌ది. స్వేచ్ఛ (హారిక‌) ఓ అనాథ‌. త‌న‌కు ఎదురైన అవ‌మానాల కార‌ణంగా త‌ల్లిద...