భారతదేశం, అక్టోబర్ 27 -- ఈవారం ఓటీటీ అభిమానులకు పండగే. ఎందుకంటే ఈ ఏడాది ఇండియన్ సినిమాలో రెండు అతిపెద్ద బ్లాక్‌బస్టర్ సినిమాలు ఒకే రోజు డిజిటల్ ప్రీమియర్ కాబోతున్నాయి. వీటిలో ఒకటి కాంతార ఛాప్టర్ 1 కాగా.. మరొకటి మలయాళం మూవీ లోకా: ఛాప్టర్ 1. ఈ రెండు మూవీస్ వేర్వేరు ఓటీటీల్లోకి అడుగుపెట్టనున్నాయి.

ఈవారం ఓటీటీ రిలీజెస్ విషయానికి వస్తే ఈ శుక్రవారం అంటే అక్టోబర్ 31న చాలా సినిమాలే రాబోతున్నాయి. అయితే వీటిలో అందరి దృష్టి మాత్రం రెండు సినిమాలపైనే ఉంది. వీటిలో ఒకటి కాంతార ఛాప్టర్ 1. ఈ నెల 2న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ.. నెల రోజుల్లోపే ఓటీటీలోకి వస్తోంది. అది కూడా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.800 కోట్లకుపైగా వసూళ్లతో ఈ ఏడాది అత్యధిక వసూళ్ల ఇండియన్ సినిమాగా నిలిచినా.. అప్పుడే డిజిటల్ ప్రీమియర్ కానుంది. ఈ సినిమా అక్టోబర్ 31 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ...