Hyderabad, అక్టోబర్ 6 -- ఓటీటీ ప్రేక్షకులకు ఈవారం పండగే అని చెప్పాలి. ఎందుకంటే ఈ వారం ఒకే రోజు రెండు తెలుగు బ్లాక్‌బస్టర్లు స్ట్రీమింగ్ కు రాబోతున్నాయి. అందులో ఒకటి హారర్ థ్రిల్లర్ మూవీ కిష్కింధపురి కాగా.. మరొకటి తేజ సజ్జా నటించిన యాక్షన్ అడ్వెంచర్ మూవీ మిరాయ్ కావడం విశేషం.

తేజ సజ్జా నటించిన మరో సూపర్ హీరో మూవీ మిరాయ్ థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోపే ఈవారం ఓటీటీలోకి వస్తోంది. సెప్టెంబర్ 12న థియేటర్లలో రిలీజ్ కాగా.. ఈ శుక్రవారం అంటే అక్టోబర్ 10 నుంచి ఓటీటీలోకి అడుగుపెడుతోంది. ఈ సినిమా జియోహాట్‌స్టార్ ఓటీటీలోకి రానుంది. గత వారమే ఈ విషయాన్ని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.

బాక్సాఫీస్ దగ్గర ప్రపంచవ్యాప్తంగా రూ.141 కోట్లకుపైగా వసూలు చేసిందీ మూవీ. కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేసిన మిరాయ్ మూవీ.. తేజకు వరుసగా రెండో బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చింది. ...