Hyderabad, ఏప్రిల్ 30 -- ఓటీటీలో ఈ వారం తమిళ సినిమాల జాతర ఉండనుంది. ఎందుకంటే ఒకే రోజు ఓటీటీలోకి మూడు మూవీస్ రాబోతున్నాయి. అందులో రెండు ఒకే ప్లాట్‌ఫామ్ లోకి కాగా.. మరొకటి ఇంకో ఓటీటీలోకి వస్తోంది. సన్ నెక్ట్స్, ఆహా తమిళం ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో ఈ సినిమాలు స్ట్రీమింగ్ కాబోతున్నాయి.

తమిళంలో ఈ ఏడాది జనవరి 24న రిలీజైన స్పోర్ట్స్ డ్రామా బ్లూ స్టార్. ఈ సినిమా మూడు నెలల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెడుతోంది. సన్ నెక్ట్స్ (sun nxt) ఓటీటీ గురువారం (మే 1) నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీ ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.

"గ్రౌండ్ సిద్ధంగా ఉంది. స్టార్లు కూడా రెడీగా ఉన్నారు. మ్యాచ్ రేపు ప్రారంభం కానుంది. బ్లూ స్టార్ రేపటి నుంచి సన్ నెక్ట్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది" అనే క్యాప్షన్ తో ఈ విషయం తెలిపింది. జయకుమార్ డైరెక్ట్ చేసిన ...