భారతదేశం, మే 17 -- టీవీ సీరియ‌ల్స్‌లో కొన్నాళ్లుగా స్టార్ మా ఛాన‌ల్‌దే ఆధిప‌త్యం కొన‌సాగుతోంది. ఒక‌ప్పుడు ఈటీవీ సీరియ‌ల్స్ టాప్‌లో ఉండేవి. స్టార్ మాతో పాటు జీ తెలుగు దెబ్బ‌కు ఈటీవీ సీరియ‌ల్స్ టీఆర్‌పీలో దారుణంగా వెనుక‌బ‌డిపోయాయి. స్టార్‌మా, జీ తెలుగుకు గ‌ట్టి పోటీ ఇచ్చేందుకు ఈటీవీ రెడీ అవుతోంది.

ఒకేరోజు ఏడు సీరియ‌ల్స్‌ను మొద‌లుపెట్ట‌బోతుంది. ఈ సీరియ‌ల్స్ టైటిల్స్‌, యాక్ట‌ర్స్‌తో పాటు టెలికాస్ట్ టైమింగ్స్‌ను ఈటీవీ రివీల్ చేసింది. ఇందుకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేసింది. మే 26 నుంచి ఈ సీరియ‌ల్స్ టెలికాస్ట్ కాబోతున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

ఈ ఏడు సీరియ‌ల్స్ మ‌ధ్యాహ్నం స్లాట్‌లోనే టెలికాస్ట్ కాబోతున్నాయి. మ‌ధ్యాహ్నం 12 గంట‌ల నుంచి మూడు గంట‌ల వ‌ర‌కు ఈ సీరియ‌ల్స్‌ను చూడొచ్చ‌ని ఈటీవీ ప్ర‌క‌టించింది. ఈ ఏడు సీరియ‌ల్స్‌కు సంబంధించి రిలీజ్ చేసిన ప్...