భారతదేశం, ఏప్రిల్ 19 -- నితిన్-శ్రీలీల కెమిస్ట్రీ.. వెంకీ కుడుముల మార్క్ కామెడీ.. ఆస్ట్రేలియా క్రికెట్ లెజెండ్ డేవిడ్ వార్నర్ క్యామియో.. ఇలా ఎన్నో ఆకర్షణలతో, మరెన్నో అంచనాలతో రిలీజైన రాబిన్‌హుడ్‌ మూవీ షాకింగ్ రిజల్ట్ ఎదుర్కొంది. కలెక్షన్లు రాబట్టలేక డిజాస్టర్ గా నిలిచింది. నితిన్ కెరీర్ లో మరో ఫ్లాప్ సినిమాగా మిగిలిపోయింది. ఇప్పుడీ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కు రానుంది. ఒకే రోజు అటు ఓటీటీలో.. ఇటు టీవీలో ఈ మూవీ రాబోతోంది.

నితిన్ హీరోగా యాక్ట్ చేసిన రాబిన్‌హుడ్‌ మూవీ డిజిటల్, శాటిలైట్ రైట్స్ ను ఫ్యాన్సీ రేట్ కు జీ5 సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ మూవీ ఓటీటీలో, టీవీలో ఒకే రోజు రాబోతోంది. ఓటీటీలోనేమో జీ5 ఫ్లాట్ఫామ్ లో, టీవీలోనేమో జీ తెలుగులో ఫ్యాన్స్ ను అలరించేందుకు వచ్చేస్తోంది. మూవీ భారీ డిజాస్టర్ గా మిగలడంతో ఒకే రోజు ఓటీటీతో పాటు టీవ...