భారతదేశం, జూన్ 27 -- పుకార్లకు తెరపడ్డట్లేనా? ఇద్దరి భామల మధ్య గొడవలేం లేవా? ఒకవేళ ఉన్నా ఆ సమస్యలు సద్దు మణిగయా?.. ఇవీ సమంత, శ్రీలీల కలిసి దిగిన ఫొటోలు చూసిన తర్వాత ఫ్యాన్స్ కు కలుగుతున్న ప్రశ్నలు. అవును.. పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ విషయంలో ఈ ఇద్దరు హాట్ బ్యూటీస్ కు గొడవలు జరిగాయనే ఊహాగానాలు తీవ్రంగా వినిపించిన సంగతి తెలిసిందే.

ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో సమంత, శ్రీలీల కలిసి కనిపించారు. దీంతో పుష్ప 2 డాన్స్ సాంగ్ వివాదంపై ఉన్న అనుమానాలకు చెక్ పెట్టారు. సమంత, శ్రీలీల ఇద్దరూ కలిసి జీక్యూ ఇండియా మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ యంగ్ ఇండియన్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారు కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫోటోలో సమంత, శ్రీలీల ఒకరినొకరు చూసుకుంటూ, చేతులు కలిపి ఉంచారు. సమంత బ్లాక్ షీర్ గౌన్ ధరించగా, శ్రీలీల ఆఫ్-షోల్డర్ రెడ్ గౌన్ వేసుక...