భారతదేశం, ఫిబ్రవరి 16 -- బాలీవుడ్ టాప్ సింగర్ అరిజీత్ సింగ్ రిటైర్మెంట్ వెనుక అసలు కారణం ఇదీ అంటూ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. తన గొంతుతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న అరిజీత్ సింగ్.. ఇకపై సినిమాల్లో ప్లేబ్యాక్ సింగర్‌గా పాటలు పాడనని అనౌన్స్ చేసి అందరినీ షాక్‌కు గురిచేశాడు. 'ట్రైడ్ అండ్ రెఫ్యూజ్డ్ ప్రొడక్షన్స్'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో డైరెక్టర్ అనురాగ్.. అరిజీత్ మనసులో మాటను బయటపెట్టాడు.

అనురాగ్ కశ్యప్ మాట్లాడుతూ.. "అరిజీత్ సింగ్ రిటైర్మెంట్ ప్రకటించడానికి ప్రధాన కారణం.. అతను ఒకే రకమైన పాటలు పాడి పాడి అలసిపోయాడు. ఎప్పుడు చూసినా అదే 'హార్ట్ బ్రేక్ సాంగ్' పాడమంటారు. అరిజీత్ చాలా ప్రతిభావంతుడు. సాన్యా మల్హోత్రా నటించిన 'పగ్లైట్' (Pagglait) సినిమాకు అతను సంగీతం అందించాడు. అతను కేవలం గాయకుడే కాదు.. ఒక మంచి ఫిలిం మేకర్ ...