భారతదేశం, జూన్ 18 -- రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ మధ్య రొమాన్స్ అభిమానుల్లో క్యూరియాసిటీని రేకెత్తిస్తోంది. తాజాగా వీరిద్దరూ కలిసి ముంబయి ఎయిర్ పోర్టు నుంచి బయటకు వచ్చి ఒకే కారులో బయలుదేరారు. దీంతో వీరిద్దరి రిలేషన్ షిప్ స్టేటస్ పై మరోసారి ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారా లేదా అని అభిమానులు ఆసక్తిగా ఆలోచిస్తున్నారు. రష్మిక, విజయ్ బుధవారం (జూన్ 18) తెల్లవారుజామున ముంబై ఎయిర్ పోర్టు నుంచి బయటకు వచ్చారు.

రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ విమానాశ్రయం నుంచి ఒకే కార్లో బయటకు రావడం హాట్ టాపిక్ గా మారింది. వీరిద్దరూ తమ ముఖాలను పాక్షికంగా మాస్కులతో కప్పుకొన్నారు. వెనుక సీట్లో కూర్చొని ఉన్న వాళ్లను ఫొటోగ్రాఫర్లు బంధించారు. కొద్ది సేపటి తర్వాత వారి కారు వెళ్లిపోయింది. కానీ అప్పటికే కెమెరాలు ఈ జంట కలిసి ఉన్న దృశ్యాన్ని బ...