భారతదేశం, అక్టోబర్ 8 -- ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాల్లో ఈ థ్రిల్లర్లు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఉత్కంఠ రేపే సస్పెన్స్ తో మంచి థ్రిల్ అందిచబోతున్నాయి. ఒకే ఓటీటీలో ఇవి స్ట్రీమింగ్ కానున్నాయి. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లోకి ఈ వారం రాబోతున్న ఈ థ్రిల్లర్లపై ఓ లుక్కేయండి.

వాస్తవ పరిస్థితులను గుర్తుచేసే సన్నివేశాలు, నిజ జీవితంలో ఇంటర్వ్యూలతో సాగే థ్రిల్లర్ డాక్యుమెంటరి సిరీస్ 'ట్రూ హంటింగ్'. అతీంద్రియ శక్తులను అనుభవించిన వారి దృక్కోణం నుండి నిజమైన సంఘటనలను తెలియజేస్తుంది. వ్యాట్ డోరియన్, రైస్ అలెగ్జాండర్ ఫిలిప్స్, మకెన్నా పికర్స్‌గిల్ తదితరులు నటించారు. ఇప్పటికే ఇది ఓటీటీలోకి వచ్చేసింది. అక్టోబర్ 7 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

ఫ్యాషన్ ప్రపంచంలో ఎలా ఉంటుంది? అందంతో పాటు ఎదురయ్యే సమస్యలు ఏంటీ అని చూపించే...