భారతదేశం, ఏప్రిల్ 19 -- హారర్ థ్రిల్లర్లు ఇష్టపడే వారికి రీసెంట్‍గా రెండు ఆప్షన్లు సూటయ్యేలా వచ్చాయి. కామెడీ లేకుండా పక్కా థ్రిల్లర్లుగా ఎంట్రీ ఇచ్చాయి. అందులో ఒకటి సినిమా కాగా.. మరొకటి వెబ్ సిరీస్. హారర్ జానర్లో వచ్చిన ఈ రెండింటింకి మంచి రెస్పాన్స్ వస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఇవి రెండు వారాల వ్యవధిలో వచ్చాయి. ఆ రెండు హారర్ థ్రిల్లర్ ఏవంటే..

హారర్ థ్రిల్లర్ 'ఛోరీ 2' సినిమా గత వారం ఏప్రిల్ 11వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. నాలుగేళ్ల కిందట వచ్చిన ఛోరీకి సీక్వెల్‍గా అడుగుపెట్టింది. ఛోరీ 2 మూవీలో నుష్రత్ బరూచా, సోహా అలీ ఖాన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ థియేటర్లలో విడుదల కాకుండా నేరుగా ఓటీటీలోకే ఎంట్రీ ఇచ్చింది.

తన ఏడేళ్ల కూతురిని దుష్టశక్తులు, సామాజిక దురాచారం నుంచి రక్షించేందుకు ఓ తల్లి...