భారతదేశం, నవంబర్ 8 -- డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఆడియన్స్ ను థియేటర్లలో ఎంటర్ టైన్ చేసిన రెండు తమిళ సినిమాలు ఇప్పుడు ఒకే ఓటీటీలోకి రాబోతున్నాయి. ఆ రెండు సినిమాలే బైసన్, డ్యూడ్. బైసన్ సినిమాలో స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధ్రువ్ విక్రమ్ హీరో. మరోవైపు డ్యూడ్ మూవీలో ప్రదీప్ రంగనాథన్ లీడ్ రోల్ ప్లే చేశాడు. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి ప్రదర్శన చేశాయి.

తమిళ సినిమాలు బైసన్, డ్యూడ్ రెండు ఒకే రోజు థియేటర్లలో రిలీజ్ అయ్యాయి. అక్టోబర్ 17న థియేటర్లలో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు వచ్చాయి. బైసన్ మూవీ రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కింది. దీనికి మారి సెల్వరాజ్ డైరెక్టర్. డ్యూడ్ ఏమో న్యూ ఏజ్ రొమాంటిక్ థ్రిల్లర్ గా థియేటర్లకు వచ్చింది. దీనికి కీర్తిశ్వరణ్ డైరెక్టర్.

బైసన్, డ్యూడ్ రెండు తమిళ సినిమాలు ఒకే ఓటీటీలోకి రాబోతున్నాయి. ప్రముఖ ఓటీటీ ప్...