భారతదేశం, డిసెంబర్ 18 -- జియోహాట్‌స్టార్ ఓటీటీ ఈ మధ్య దూకుడు పెంచుతోంది. వరుసగా కొత్త సినిమాలతోపాటు ఒరిజినల్ వెబ్ సిరీస్ లనూ స్ట్రీమింగ్ చేస్తోంది. ఇక ఇప్పుడీ శుక్రవారం అంటే డిసెంబర్ 19న ఒకే రోజు రెండు వేర్వేరు భాషలకు చెందిన రెండు థ్రిల్లర్ వెబ్ సిరీస్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.

జియోహాట్‌స్టార్ లోకి ఫార్మా అనే మలయాళం మెడికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ వస్తోంది. ఓ సాధారణ మెడికల్ రిప్రజెంటేటివ్ ఓ మెడికల్ మాఫియాకు ఎలా ఎదురు తిరిగాడన్న ఓ నిజ జీవిత ఘటన ఆధారంగా ఈ సిరీస్ ను తెరకెక్కించారు. ఇది తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుండటం విశేషం.

కేపీ వినోద్ అనే ఓ మెడిల్ రెప్ చుట్టూ తిరిగే కథ ఇది. మొదట తన ఉద్యోగంలో నిలదొక్కుకోవడానికి అతడు పడే బాధలను ఫన్నీగా చూపించిన ఈ వెబ్ సిరీస్ ట్రైలర్.. తర్వాత అసలు కథలోకి వెళ్లింది. ఆ చిన్న ఉ...