భారతదేశం, డిసెంబర్ 3 -- ఓటీటీలోకి ఈ నెలలో ఎన్నో ఇంట్రెస్టింగ్ సినిమాలు స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. అయితే అందులో ఒకే ఓటీటీలోకి ఒకే రోజు రెండు థ్రిల్లర్ సినిమాలు రానుండటం విశేషం. ఇవి రెండూ థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకి అడుగుపెడుతున్నాయి. వీటిలో ఒకటి తెలుగు మూవీ దివ్య దృష్టి కాగా.. మరొకటి తమిళ మూవీ అన్ పార్వాయిల్.

సన్ నెక్ట్స్ ఓటీటీ బుధవారం (డిసెంబర్ 3) ఒకేసారి రెండు థ్రిల్లర్ సినిమాలను అనౌన్స్ చేసి ఆశ్చర్యపరిచింది. కబీర్ లాల్ ఈ రెండు మూవీస్ ను డైరెక్ట్ చేశాడు. అందులో ఒకటి తెలుగు, మరొకటి తమిళ సినిమాలు. "మీరు చూసే ముందే ఆ భయాన్ని ఫీలవ్వండి. దివ్య దృష్టి నేరుగా డిసెంబర్ 19న సన్ నెక్ట్స్ ఓటీటీలోకి వస్తోంది" అనే క్యాప్షన్ తో ఆ ఓటీటీ ట్వీట్ చేసింది.

ఇక మరో తమిళ మూవీ అన్ పార్వాయిల్ కూడా అదే రోజు స్ట్రీమింగ్ కు వస్తోంది. "మీ కళ్లు మూసుకోండి...