భారతదేశం, ఫిబ్రవరి 16 -- టాలీవుడ్‌లో 'యమదొంగ', 'కింగ్' వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మలయాళ బ్యూటీ మమతా మోహన్‌దాస్ (Mamta Mohandas). క్యాన్సర్‌ను జయించి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిన ఆమె.. తాజాగా తన ప్రేమ జీవితం, పెళ్లి, రిలేషన్షిప్స్ గురించి సంచలన విషయాలు వెల్లడించింది. జోస్ ఆలుక్కాస్ ఆధ్వర్యంలో నటి సుహాసిని (Suhasini) హోస్ట్ చేస్తున్న పాడ్‌కాస్ట్‌లో ఆమె తన గతాన్ని గుర్తుచేసుకుంది.

తన క్యాన్సర్ చికిత్స తర్వాత, పెళ్లికి ముందు తాను ఇద్దరు వ్యక్తులతో డేటింగ్ చేశానని మమతా మోహన్‌దాస్ తెలిపింది. "నేను సినిమా ఇండస్ట్రీకి చెందిన ఒక నటుడితో డేటింగ్ చేశాను. అతను నన్ను డేట్‌కి అడిగినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. మా అమ్మ పర్మిషన్ తీసుకుని మరీ వెళ్లాను. కానీ అప్పటికే అతనికి ఎంగేజ్మెంట్ అయిపోయిన విషయం నాకు తెలియదు. ఒక నెల తర్వాత వాళ్ళ...