భారతదేశం, నవంబర్ 26 -- మలక్కా జలసంధి ప్రాంతాల్లో వాయుగుండం కొనసాగుతుందని వాతావరణశాఖ తెలిపింది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతూ రాబోయే 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని వెల్లడించింది.గురువారం నుంచి మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళరాదని హెచ్చరించింది.

నైరుతి బంగాళాఖాతం, దక్షిణ శ్రీలంక మరియు హిందూ మహాసముద్రం మీదుగా మరో అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని ఐఎండీ పేర్కొంది. ఇది 24 గంటల్లో ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ తీవ్రఅల్పపీడనంగా మారే అవకాశం ఉందని వివరించింది. ఆ తదుపరి 24 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని అంచనా వేసింది.

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ బులెటిన్ లోని వివరాల ప్రకారం.. అల్పపీడనం, వాయుగుండం ప్రభావంతో శనివారం నుంచి మంగళవారం వరకు (నవంబర్ 29 నుంచి డిసెంబర్ 2) కోస్తాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉం...