Hyderabad, ఏప్రిల్ 23 -- మలయాళం ఇండస్ట్రీ నుంచి గతేడాది క్రిస్మస్ కు మూడు సినిమాలు వచ్చాయి. అందులో ఒకటి ఈడీ ఎక్ట్స్రా డీసెంట్ (ED Extra Decent). కామెడీ థ్రిల్లర్ జానర్లో వచ్చిన ఈ సినిమా డిసెంబర్ 20న రిలీజైంది. అయితే అదే సమయానికి వచ్చిన మార్కో మూవీ దెబ్బకు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆడలేదు. మొత్తానికి నాలుగు నెలల తర్వాత ఇప్పుడు ఒకేసారి మూడు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లోకి అడుగుపెట్టబోతోంది.

ఈడీ ఎక్ట్స్రా డీసెంట్ మూవీకి నాలుగు నెలలుగా ఓటీటీ ప్లాట్‌ఫామ్ దొరకలేదు. ఈ మధ్యే సైనా ప్లే ఓటీటీ ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్నట్లు అనౌన్స్ చేసింది. ఇక ఇప్పుడు ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ తేదీని కూడా వెల్లడించింది.

ఈ మూవీ శనివారం (ఏప్రిల్ 26) నుంచి సైనా ప్లే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. దీంతోపాటు అమెజాన్ ప్రైమ్ వీడియో, మనోరమ మ్యాక్స్ లలోకీ ఈ మూవీ అడుగుప...