Hyderabad, జూన్ 20 -- మలయాళం థ్రిల్లర్ సినిమాలు రెగ్యులర్ గా ఫాలో అవుతుంటారా? అయితే మీకోసం మరో సినిమా ఓటీటీలోకి వస్తోంది. ఈ మూవీ పేరు ఆజాదీ (Azadi). బాక్సాఫీస్ దగ్గర పెద్దగా సక్సెస్ సాధించకపోయినా.. ఐఎండీబీలో 7.3 రేటింగ్ తో ఫర్వాలేదనిపించింది. మంజుమ్మెల్ బాయ్స్ హీరో శ్రీనాథ్ భాసి లీడ్ రోల్లో నటించిన మూవీ ఇది. ఒకేసారి రెండు ఓటీటీల్లోకి వస్తోంది.

మలయాళం థ్రిల్లర్ మూవీ ఆజాదీ మే 23న థియేటర్లలో రిలీజైంది. జో జార్జ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను జూన్ 27 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు సన్ నెక్ట్స్ (Sun Nxt) ఓటీటీ శుక్రవారం (జూన్ 20) వెల్లడించింది. "నిజం మీకు స్వేచ్ఛనివ్వాలి తప్ప బంధించకూడదు. మీకు ఆజాదీ ఎప్పుడు వస్తుందో తెలుసుకోవడానికి చూస్తూనే ఉండండి. వాళ్లు అతని హక్కును లాక్కున్నారు.

అతడో నిర్ణయం తీసుకున్నాడు. ఫ్రీడమ్ ఇచ్చేది కాదు.. తీసుకునేది" అన...