భారతదేశం, ఏప్రిల్ 16 -- ఉపాధి కోసం సొంతూరు విడిచి వరంగల్ నగర బాట పట్టిన ఓ యువకుడు ఈజీ మనీ కోసం రాంగ్ రూట్ ఎంచుకున్నాడు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో బైక్ చోరీలకు పాల్పడటం మొదలెట్టాడు. ఒక్కడే వరంగల్, రాచకొండ కమిషనరేట్ ల పరిధిలో ఏకంగా 18 బైక్ లు కొట్టేశాడు. అనంతరం వాటన్నింటినీ ఒకేసారి అమ్మేందుకు ప్లాన్ చేసి, ఇంటి వద్ద భద్రపరుచుకున్నాడు. చివరకు అనూహ్యంగా పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు.

రద్దీ ప్రాంతాల్లో పార్క్ చేసి ఉన్న బైక్ లే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న దొంగను హసన్ పర్తి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి దాదాపు రూ.10 లక్షల విలువైన 18 బైక్ లు, ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి అరెస్టుకు సంబంధించిన వివరాలను కాజీపేట ఏసీపీ తిరుమల్ బుధవారం హసన్ పర్తి పీఎస్ లో వెల్లడించారు.

జనగామ జిల్లా చిల్పూరు మండలం ఫతేపూర్ గ...