Hyderabad, జూన్ 12 -- మలయాళం థ్రిల్లర్ మూవీసే కాదు.. కామెడీ సినిమాలు కూడా అదిరిపోతాయని నిరూపించిన మూవీ ఆలప్పుళ జింఖానా (Alappuzha Gymkhana). బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించిన ఈ మూవీ.. చెప్పినదాని కంటే ఒక రోజు ముందే ఓటీటీలోకి అడుగుపెట్టింది. తెలుగులో అదిరిపోయే డైలాగ్స్ ఉన్న ఈ సినిమా స్ట్రీమింగ్ వివరాలు ఇక్కడ చూడండి.

మలయాళం ఇండస్ట్రీ నుంచి ఈ ఏడాది వచ్చిన బ్లాక్‌బస్టర్ సినిమాల్లో ఒకటి ఈ ఆలప్పుళ జింఖానా. ఏప్రిల్ 10న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ రెండు నెలల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. నిజానికి శుక్రవారం (జూన్ 13) నుంచి స్ట్రీమింగ్ ఉంటుందని చెప్పిన సోనీ లివ్ (Sony Liv) ఓటీటీ గురువారం సాయంత్రమే ఈ సినిమాను అందుబాటులోకి తీసుకొచ్చింది.

"మీ హృదయాలను గెలవడానికి జింఖానా గ్యాంగ్ వచ్చేసింది. ఆలప్పుళ జింఖానా మూవీ సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతో...