Hyderabad, ఫిబ్రవరి 20 -- పగ, కోపం, కక్షలు వంటివి పెట్టుకుని సాధించేది ఏమీ లేదు. పైగా ఎన్నో ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. ఈ విషయాన్ని మేము చెప్పడం లేదు... కొత్త అధ్యయనం చెబుతోంది. మీ జీవితంలో మీకు నచ్చని పనులు చేసిన వారిపై పగ, కక్ష పెంచుకుంటే అది మీకే తీవ్ర నష్టాన్ని చేస్తుందని, ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడేలా చేస్తుందని ఒక కొత్త అధ్యయనం తేల్చింది. ఎదుటివారిపై ఉన్న పగ మీ సొంత ఆరోగ్యానికి ఎంత హాని కలిగిస్తుందో తెలుసుకోండి.

పగ, కక్షలు పెట్టుకోవడం అనేది దీర్ఘకాలిక ఒత్తిడికి, అధిక రక్తపోటుకు, రోగనిరోధక శక్తి బలహీనంగా మారడానికి కారణం అవుతుంది. దీనివల్ల గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులు వచ్చే అవకాశం కూడా పెరిగిపోతుంది. అదే ఎదుటివారిని క్షమించేస్తే మీ మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఒత్తిడి తగ్గిపోతుంది. రోగ నిరోధక వ్యవస్థ బలంగా మార...