భారతదేశం, జనవరి 11 -- మలయాళ నటి పార్వతి తిరువోతు తెలుసు కదా. ఆ ఇండస్ట్రీకే పరిమితం కాకుండా తన సహజమైన నటనతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటి ఆము. తెరపై ఎంత సీరియస్‌గా కనిపిస్తుందో బయట కూడా విషయాలను అంతే సూటిగా, కుండబద్దలు కొట్టినట్లు చెబుతుంది. తాజాగా 'ది మేల్ ఫెమినిస్ట్' (The Male Feminist) అనే కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. చిన్నతనంలో తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి వివరిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది.

ఆనాటి చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ పార్వతి తిరువోతు తీవ్ర భావోద్వేగానికి లోనయింది. "మనం పుట్టడమే ఆలస్యం.. మనపై దాడులు మొదలవుతాయి. ఆటో ఎక్కుతుంటే ఎవరో గిల్లేవారు. ఒకసారి రైల్వే స్టేషన్‌లో అమ్మను వదిలి, నాన్న వైపు నడుచుకుంటూ వెళ్తున్నాను. ఇంతలో ఎవరో ఒక వ్యక్తి వచ్చి నా ఛాతీపై బలంగా కొట్టి పారిపోయాడు. అది ఏదో పొరపాటున తాకడం కా...