భారతదేశం, నవంబర్ 17 -- పైరసీ సైట్ ఐబొమ్మ నిర్వాహకుడిని అరెస్టు చేసినట్లు హైదరాబాద్ సీపీ సజ్జనార్ ప్రకటించారు. ఈ మేరకు ప్రెస్ మీట్ పెట్టారు. సినీ ఇండస్ట్రీ నుంచి చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, దిల్ రాజు, సురేష్ బాబు తదితరులతో కలిసి సజ్జనార్ ఈ విలేకర్ల సమావేశం పెట్టారు. ఈ ప్రెస్ మీట్ లో పోలీసులకు చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు.

ఎంతో కాలంగా ఈ పైరసీ నుంచి తప్పించుకోవాలని ఆలోచిస్తున్నట్లు చిరంజీవి పేర్కొన్నారు. ''చాలా సంవత్సరాలుగా పైరసీ మహమ్మారి నుంచి ఎలా బయటపడాలని చాలా వర్రీ అవుతుండేవాళ్లం. సినిమా ఇండస్ట్రీ మీద డైరెక్ట్ గా, ఇండైరెక్ట్ గా లక్షల మంది ఆధారపడి ఉన్నారు. లైట్ బాయ్ నుంచి చాలా మంది ఆధారపడి ఉన్నారు. ఇంతమంది కష్టాన్ని ఒకడు అప్పనంగా వచ్చి దౌర్జన్యంగా దోచుకుంటుంటే, సవాలు విసురుతుంటే ఏం చేయాలో తెలియని పరిస్థితి'' అని చిరంజీవి అన్నారు.

''దీ...