భారతదేశం, జూలై 20 -- హెచ్‌డీఎఫ్‌సీ పరివర్తన్స్ ఎడ్యుకేషనల్ క్రైసిస్ స్కాలర్‌షిప్ సపోర్ట్ ప్రోగ్రామ్ ద్వారా స్కాలర్‌షిప్ అందిస్తున్నారు. ఈ స్కాలర్‌షిప్ ఒకటో తరగతి నుంచి పీజీ వరకు చదువుతున్న విద్యార్థులు అర్హులు. సెప్టెంబర్ 4వ తేదీ వరకు అప్లై చేయవచ్చు. మీరు లేదా మీకు తెలిసిన ఎవరైనా ఆర్థికంగా వెనకపడి ఉంటే.. ఈ స్కాలర్‌షిప్ ఎంతగానో ఉపయోగపడనుంది. చదువును కొనసాగించడానికి అవసరమైన సహాయాన్ని అందిస్తుంది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు పరివర్తన్స్ ఎడ్యుకేషనల్ క్రైసిస్ స్కాలర్‌షిప్ సపోర్ట్ ప్రోగ్రామ్ 2025-26కు దరఖాస్తులు చేసుకోవాలి. 1 నుంచి 12వ తరగతి, డిప్లోమా, ఐటీఐ, పాలిటెక్నిక్, యూజీ, పీజీ జనరల్/ప్రొఫెషనల్ కోర్సులు చదువుతూ ఉండాలి. విద్యార్థుల వార్షిక ఆదాయం విషయానికికొస్తే రూ.2.5లక్షలకు మించకూడదు. గత విద్యా సంవత్సరంలో కనీసం 55 శాతం మార్కులు సాధించి ఉండాలి. ...