భారతదేశం, జూన్ 6 -- ఫ్యాన్స్ కు థ్రిల్ అందించడంతో పాటు ఎమోషనల్ జర్నీలోకి తీసుకొచ్చేందుకు ఒకే రోజు రెండు మలయాళం సినిమాలు ఓటీటీలోకి అడుగుపెట్టాయి. ఇందులో ఒకటేమో పాట చుట్టూ సాగే ఎమోషనల్ డ్రామా 'పాతు' మూవీ కాగా.. మరొకటేమో పారానార్మల్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ 'వడక్కన్'. ఈ రెండు మలయాళం సినిమాలు ఈ రోజు (జూన్ 6) ఓటీటీలో అడుగుపెట్టాయి. ఆ మూవీస్ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయో ఇక్కడ చూద్దాం.

మలయాళం ఎమోషనల్ డ్రామా ఫిల్మ్ 'పాతు' డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. 2024 కేరళ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఈ మూవీ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. ప్రశంసలు అందుకుంది. కానీ ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కాలేకపోయింది. ఇప్పుడు డైరెక్ట్ గా ప్రేక్షకులను అలరించేందుకు ఓటీటీలోకి వచ్చేసింది. మనోరమా మ్యాక్స్ ఓటీటీలో ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళం భాషలో ఈ మూవీ వచ్...