భారతదేశం, ఆగస్టు 10 -- ఐకూ నుంచి కొత్త స్మార్ట్​ఫోన్​ చైనాలో ఇటీవలే లాంచ్​ అయ్యింది. దాని పేరు ఐకూ జెడ్​10 టర్బో+. ఈ మొబైల్​ త్వరలోనే ఇండియాలో కూడా లాంచ్​ అయ్యే అవకాశం ఉంది. లంచ్​ అనంతరం ఈ గ్యాడ్జెట్​ ఒప్పో రెనో 14కి గట్టి పోటీని ఇస్తుందని అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండింటిలో ఏది బెస్ట్​? దేని ఫీచర్స్​ ఎలా ఉన్నాయి? వంటి వివరాలను ఇక్కడ చూసేయండి..

ఐకూ జెడ్​10 టర్బో+ 5జీ ఫోన్‌లో 6.78-ఇంచ్​ అమోఎల్​ఈడీ డిస్‌ప్లే ఉంది. దీని రిజల్యూషన్ 2800x1260 పిక్సెల్స్, 144హెచ్​జెడ్​ రిఫ్రెష్ రేట్. ఇది హెచ్​డీఆర్​ కంటెంట్‌కు సపోర్ట్ చేస్తుంది. 1.07 బిలియన్ రంగులను ప్రదర్శిస్తుంది. మంచి విజువల్స్, స్పష్టమైన రంగులను కోరుకునే వారికి ఇది ఉత్తమ ఎంపిక.

ఒప్పో రెనో 14 5జీ స్మార్ట్​ఫోన్​ విషయానికొస్తే.. ఇందులో 6.59-ఇంచ్​ 1.5కే ఓఎల్​ఈడీ డిస్‌ప్లే ఉంది. దీని రిఫ...