భారతదేశం, సెప్టెంబర్ 20 -- రియల్‌మీ సంస్థ ఇటీవలే ఇండియాలో తన కొత్త పీ సిరీస్‌లో భాగంగా రియల్‌మీ పీ4 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. స్టైలిష్ డిజైన్, పెద్ద డిస్‌ప్లే, అద్భుతమైన కెమెరా, శక్తివంతమైన పర్ఫార్మెన్స్ కోరుకునే యువత కోసం ఈ ఫోన్‌ను రూపొందించింది. రూ. 25,000 లోపు ధరలో లభించే ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్, 144హెచ్​జెడ్​ డిస్‌ప్లే, భారీ 7000ఎంఏహెచ్​ బ్యాటరీ వంటి ఫీచర్లను అందిస్తోంది.

అయితే ఇదే ధరలో ఇటీవల విడుదలైన వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5 5జీ కూడా ఆకట్టుకునే ఫీచర్లతో రియల్‌మీకి గట్టి పోటీ ఇస్తోంది. మరి ఈ రెండు ఫోన్‌లలో ఏది బెటర్​? అనేది ఇక్కడ తెలుసుకోండి.

రియల్‌మీ పీ4 ప్రో 5జీ స్మార్ట్​ఫోన్​లో గ్లాసీ వుడ్-ప్రేరిత ఫినిషింగ్‌తో భారీ కెమెరా ఐలాండ్ ఉంది. భారీ బ్యాటరీ ఉన్నప్పటికీ, ఈ ఫోన్ కేవలం 7.69 ఎంఎం పలుచగా, 189 గ్రా...