భారతదేశం, సెప్టెంబర్ 1 -- ఎలక్ట్రిక్ స్కూటర్ల మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. అయితే ఈ పోటీ ప్రపంచంలో టీవీఎస్ మోటార్ కొత్తగా 'ఆర్బిటర్' అనే అఫార్డిబుల్​ ఈవీని పరిచయం చేసింది. ఇది ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న ఏథర్ రిజ్టా వంటి స్కూటర్లకు గట్టి పోటీనిస్తోంది. ఈ నేపథ్యంలో టీవీఎస్​ ఆర్బిటర్​ని ఏథర్​ రిజ్టాతో పోల్చి.. ఎందులో రేంజ్​ ఎక్కువ? ఎందులో వాల్యూ ఎక్కువ? వంటివి ఇక్కడ తెలుసుకుందాము..

టీవీఎస్ ఆర్బిటర్ ఎలక్ట్రిక్​ స్కూటర్​ సంప్రదాయ డిజైన్‌ను కలిగి ఉంది. ఇది కాంపాక్ట్‌గా, ఉపయోగకరంగా ఉంటూ కొత్త రైడర్లకు భయం లేకుండా ఉంటుంది. ఈ స్కూటర్ బరువు 112 కిలోలు. ఇది నగర ట్రాఫిక్‌లో ఉపయోగించడానికి అనువుగా ఉంటుంది. మరోవైపు ఫ్యామలీ ఎలక్ట్రిక్​ స్కూటర్​గా పేరొందిన రిజ్టా.. కాస్త పెద్దదిగా, ప్రీమియం లుక్‌తో ఉంటుంది. దీని సీటు కూడా విశాలంగా ఉంటుంది.

కంపెనీలు పే...