HYDERABAD, ఏప్రిల్ 20 -- కొన్నేళ్లుగా అందరిలోనూ ఒంటరితనంపై ఎన్నో అపోహలున్నాయి. ఎవరితోనూ కలవకుండా ఒంటరిగా ఉండిపోవడం వల్ల ప్రమాదమంటూ పలువురు సందేహాలు కూడా వ్యక్తం చేశారు. ఈ మేరకు జరిపిన ఒక అధ్యయనంలో ఉదయాన్నే అందరికంటే ముందే లేచేవారిని, పబ్లిక్‌తో కలవకుండా ఇంటికి దూరంగా గడిపేవారిని, ఒంటరిగా మద్యం సేవించేవారిని పరిశీలించగా ఒక యాబై సంవత్సరాలలో వీరి సంఖ్య గణనీయంగా పెరిగిపోయిందట. ఇదంతా చాలా ప్రమాదకరమైన విషయమని, సమాజంతో కలిసి ఉండకుండా ఒంటరిగా ఉండేవారు డిప్రెషన్, ఆయుష్షు తగ్గిపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటారని అనుకున్నాం.

కానీ, ఇదే విషయాన్ని మరోవైపు నుంచి చూస్తే.. తమ జీవితంలో సమస్యలు లేకుండా ఉండాలని కోరుకునే వారే ఒంటరితనంలో గడపాలనుకుంటారట. ఆ పరిస్థితులకు దరిదాపుల్లోనే వారి జీవితం గడుపుతుంటారట కూడా.

ఒక సైకాలజిస్టు అభిప్రాయం ప్రకారం.. తను పదేళ్ల పాట...