భారతదేశం, నవంబర్ 26 -- ఒంగోలు విమానాశ్రయం కోసం వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక (DPR) సిద్ధం అవుతోంది. కోల్‌కతాకు చెందిన ఒక ప్రైవేట్ ఏజెన్సీ బృందం, ఒంగోలు-కొత్తపట్నం రహదారిలోని అల్లూరు, ఆలూరు గ్రామాలలో భూ సర్వేతో సహా ప్రాథమిక పనులను ప్రారంభించింది. సోమవారం ఒంగోలుకు చేరుకున్న ఏజెన్సీ బృందం అల్లూరు, ఆలూరు గ్రామాలను సందర్శించి అక్కడ ప్రతిపాదిత విమానాశ్రయ భూములను పరిశీలించి, భూ సర్వే నిర్వహించింది.

అల్లూరు గ్రామ సచివాలయంలో స్థానిక నివాసితులు, రైతులతో కూడా ఈ బృందం మాట్లాడింది. అంతేకాకుండా ఒంగోలు విమానాశ్రయ ప్రాజెక్టు కోసం ఇప్పటికే సేకరించిన భూమి వివరాలు, తదుపరి సేకరణ అవకాశాల గురించి చర్చించడానికి వారు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిని ఫోన్‌ ద్వారా సంప్రదించి మాట్లాడారు.

కొత్తపట్నం సమీపంలో అల్లూరు, ఆలూరు గ్రామాల చుట్టూ దాదాపు 1,086 ఎకరాలన...