భారతదేశం, నవంబర్ 15 -- అటు ఓటీటీలకు, ఇటు సినీ నిర్మాతలకు చుక్కలు చూపించిన అదిపెద్ద పైరసీ వెబ్‌సైట్ ఐ-బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ అయ్యాడు. కొత్తగా రిలీజ్ అయిన సినిమాలను, వెబ్ సిరీస్‌లను పైరసీ చేస్తూ ఐ బొమ్మ ప్రస్తుతం (బప్పమ్ టీవీ) వెబ్‌సైట్‌లో ఇమ్మడి రవి పోస్ట్ చేస్తుండేవాడు.

అటు థియేటర్లలో విడుదలైన సినిమాలతోపాటు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, జీ5 తదితర ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్‌లలోని మూవీస్, వెబ్ సిరీస్‌లను అదే రోజున క్వాలిటీతో పైరసీ చేసి సైట్‌లో పెట్టడం ఐ బొమ్మ స్పెషలాటి అని తెలిసిందే.

ఇన్నేళ్లు పైరసీ సినిమాలను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసిన ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. శనివారం (నవంబర్ 15) ఉదయం కూకట్‌పల్లిలో సీఎస్ పోలీసులు ఇమ్మడి రవిని అదుపులోకి తీసుకున్నారు.

నిన్న (నవం...