Hyderabad, మే 9 -- మీకు గుర్తుందా! 2014లో ఒక వింత ఉద్యమం ప్రపంచాన్ని కుదిపేసింది. అదే ఐస్ బకెట్ ఛాలెంజ్. సెలబ్రిటీల నుండి సామాన్యుల వరకు అందరూ దీంట్లో పాల్గొని తలపై చల్లటి నీటిని పోసుకుంటూ, మరొకరిని సవాలు విసిరారు. ఆ రోజుల్లో అది కేవలం ఒక సరదా ట్రెండ్ మాత్రమే కాదు, అరుదైన వ్యాధి అయిన ALS (అమియోట్రోఫిక్ లాటరల్ స్క్లెరోసిస్) పరిశోధన కోసం ఊహించని స్థాయిలో విరాళాలను సేకరించింది. ఇప్పుడు, దాదాపు ఒక దశాబ్దం తర్వాత, అదే ఐస్ బకెట్ ఛాలెంజ్ మళ్లీ ట్రెండ్ అవుతోంది.

అయితే ఈసారి లక్ష్యం మరింత ముఖ్యమైనది, మరింత మానవీయమైనది. ఇంతకీ ఏంటా కొత్త లక్ష్యం? గతంలో ఒక వ్యాధిపై పోరాడిన ఈ ఉద్యమం, ఇప్పుడు దేని కోసం గళం విప్పుతోంది? సోషల్ మీడియాలో మళ్లీ ఎందుకు ఈ హడావుడి? వంటి ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకుందాం రండి..

2014లో ఐస్ బకెట్ ఛాలెంజ్ ప్రపంచవ్యాప్తంగా ...