భారతదేశం, మే 10 -- హైదరాబాద్ లోని ఐసీఎంఆర్-నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషన్ నిన్ సెట్(NIN CET 2025) నోటిఫికేషన్ విడుదల చేసింది. 2025-2027 విద్యాసంవత్సరానికి రెండేళ్ల ఎంఎస్సీ(అప్లైడ్‌ న్యూట్రిషన్‌), ఎంఎస్సీ(స్పోర్ట్స్‌ న్యూట్రిషన్‌) కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానించారు. అర్హులైన అభ్యర్థులు జూన్‌ 2లోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

1. ఎంఎస్సీ(అప్లైడ్‌ న్యూట్రీషన్‌)

2. ఎంఎస్సీ(స్పోర్ట్స్‌ న్యూట్రీషన్‌)

సంబంధిత విభాగాల్లో ప్రవేశాలకు డిగ్రీ(బీఎస్సీ),ఎంబీబీఎస్‌, బీడీఎస్‌లో ఉత్తీర్ణత ఉండాలి.

మీరు న్యూ యూజర్ అయితే, పేరు, పుట్టిన తేదీ, ఈ-మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ వంటి ప్రాథమిక వివరాలతో వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్ వస్తుంది.

అందుబాటులో ఉన్న ఆన్‌లైన్ చెల్లింపు పద్ధతులను (క్రెడిట్ కార్డ్, డెబ...