భారతదేశం, డిసెంబర్ 9 -- డిజిటల్ ప్లాట్‌ఫామ్ జియోహాట్‌స్టార్ దక్షిణాది కంటెంట్‌పై ప్రత్యేక దృష్టి సారించింది. వరుసగా క్రేజీ ప్రాజెక్టులను లైన్‌లో పెడుతోంది. అందులో భాగంగానే తాజాగా 'మూడు లాంతర్లు' (Moodu Lantharlu) అనే ఆసక్తికరమైన వెబ్ సిరీస్‌ను ప్రకటించింది. ఇందులో విశేషమేమిటంటే 'సంక్రాంతికి వస్తున్నాం' ఫేమ్, విలక్షణ నటి ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్ర పోషిస్తుండటం సిరీస్‌పై ఆసక్తిని పెంచుతోంది.

ఈ వెబ్ సిరీస్ కథాంశం చాలా భిన్నంగా ఉండబోతోంది. ఇది 90వ దశకం ఆరంభంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నేపథ్యంలో సాగుతుంది. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

ఆ సమయంలో ఒక చిన్న పట్టణంలో మందు దొరక్క జనం పడే పాట్లు, మందు కోసం వారు చేసే సాహసాలు, దాని చుట్టూ అ...