భారతదేశం, డిసెంబర్ 28 -- సంచలనం సృష్టించిన ఐబొమ్మ రవి కేసుకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. అయితే తాజాగా మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. వెల్లేల ప్రహ్లాద్ అనే వ్యక్తి పేరుతో రవి, పాన్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాడు. విచారణ చేస్తుంటే.. అతడు తన రూమ్‌మేట్ అని.. అందుకే ఆ పేరును వాడుకున్నట్టుగా వెల్లడించాడు. ప్రహ్లాద్ గురించి పోలీసులు ఆరా తీశారు.

బెంగళూరు నుంచి ప్రహ్లాద్‌ను పిలిపించారు. కస్టడీలో ఉన్న ఐబొమ్మ రవి ముందుగానే ప్రహ్లాద్‌ను విచారణ చేశారు. దీంతో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. నిజానికి ఐబొమ్మ రవి, ప్రహ్లాద్‌కు ఎలాంటి సంబంధం లేదు. ఇదే విషయాన్ని ప్రహ్లాద్ తెలిపాడు. రవి ఎవరో తనకు తెలియదని, తన పేరుతో పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నట్టుగా తెలిసి షాక్ అయ్యానని చెప్పాడు ప్రహ్లాద్. బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్య...