భారతదేశం, నవంబర్ 26 -- ఐబొమ్మ రవి కేసులో ట్విస్ట్ నెలొంది. ఇమంది రవి సినిమాలు పైరసీ చేయలేదని, సినిమాలను కొని వాటిని కంటెంట్ మేనెజ్‌మెంట్ సిస్టమ్ ద్వారా ఐబొమ్మలో అప్‌లోడ్ చేసేవాడని పోలీసులు గుర్తించారు. కొన్ని రోజులుగా ఐబొమ్మ రవిని విచారించిన పోలీసులు కీలక విషయాలను తెలుసుకున్నారు. అయితే ఐబొమ్మ రవి సినిమాలను నేరుగా పైరసీ చేయలేదని, టెలిగ్రామ్, మూవీరూల్జ్, తమిళ్ ఎంవీ వంటి పైరసీ సైట్ల నుంచి వాటిని కొనుగోలు చేసే వాడని తెలిసింది.

సినిమా క్లారిటీ సరిగా లేకపోతే.. దానికి హెచ్‌డీ‌గా మార్చుకునేందుకు కొన్ని టూల్స్ ఉపయోగించేవాడు. తర్వాత ఐబొమ్మ, బప్పం సైట్లలో అప్‌లోడ్ చేసేవాడు. ఇందుకుగానూ సినిమా కొన్నందుకు క్రిప్టో కరెన్సీ రూపంలో డబ్బులు చెల్లించేవాడు. ఈ సైట్ల ద్వారా లక్షల మంది డేటాను తన వద్ద స్టోర్ చేసుకున్నాడు రవి. బెట్టింగ్, గేమింగ్ యాప్స్ ప్రమోట్ చ...