భారతదేశం, మే 16 -- రాజస్తాన్ లో సంచలనం సృష్టించిన ఐబీ అధికారి హత్య కేసులో ఝలావర్ కోర్టు తీర్పు వెలువరించింది. హత్యకు గురైన ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి భార్యను, ఆమె ప్రియుడిని ప్రధాన దోషులుగా నిర్ధారించింది. ఆ ఇద్దరికి, వారికి సహకరించిన ఇతరులకు జైలు శిక్ష విధించింది. ఆ ఐబీ అధికారి భార్య ప్రియుడు రాజస్తాన్ లో పోలీసు అధికారి కాగా, అతడిని డిపార్ట్మెంట్ విధుల్లో నుంచి సస్పెండ్ చేసింది.

ఈ హత్య కేసులో దోషులుగా తేలిన సస్పెన్షన్ కు గురైన రాజస్థాన్ పోలీసు అధికారికి యావజ్జీవ కారాగార శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధించగా, ఐబీ అధికారి భార్య, మరో దోషికి 14 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. సాక్ష్యాధారాలు లేకపోవడంతో మరో నిందితుడిని నిర్దోషిగా ప్రకటించింది.

న్యూఢిల్లీలోని ఇంటలిజెన్స్ బ్యూరోలో సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ గా పనిచేస్తున్న చేతన్ ప్రకాశ్ గలావ్...