భారతదేశం, సెప్టెంబర్ 14 -- స్మార్ట్‌ఫోన్ల మార్కెట్‌లో అత్యంత ఆధునిక మోడల్స్‌లో ఒకటిగా యాపిల్ ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. మరోవైపు శాంసంగ్ నుంచి సరికొత్త ఫోల్డెబుల్ టెక్నాలజీతో గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7 మార్కెట్లోకి వచ్చింది. ఈ రెండు ఫోన్లు ప్రీమియం వినియోగదారులను లక్ష్యంగా చేసుకున్నప్పటికీ, వాటి తయారీలో కంపెనీల ఆలోచనా విధానం పూర్తిగా భిన్నంగా ఉంది. ఐఫోన్ ఒక సాధారణ స్లాబ్ డిజైన్‌ను అనుసరిస్తే, శాంసంగ్ మాత్రం ఫోల్డెబుల్ ఫామ్‌ను ఎంచుకుంది. డిజైన్, కెమెరా, స్పెసిఫికేషన్లు, ఫీచర్ల పరంగా ఈ రెండు ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ల మధ్య ఉన్న తేడాలను ఇప్పుడు చూద్దాంము..

ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ అల్యూమినియం, మ్యాట్ గ్లాస్ కలయికతో తయారైంది. ఇందులో వైర్‌లెస్ ఛార్జింగ్ కోసం మ్యాగ్‌సేఫ్ కాయిల్ అమర్చారు. యాపిల్ కొత్తగా డిస్‌ప్లేపై సెరామిక్ ...