భారతదేశం, డిసెంబర్ 14 -- ఫ్లిప్‌కార్ట్ నిర్వహిస్తున్న 'ఎండ్ ఆఫ్ సీజన్ సేల్' డిసెంబర్ 12 నుంచి 21 వరకు కొనసాగుతోంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, వేరబుల్స్‌పై భారీ తగ్గింపులు లభిస్తున్నాయి. మరీ ముఖ్యంగా యాపిల్ ఐఫోన్ 16 ప్రోపై అందిస్తున్న తగ్గింపు కస్టమర్‌ల దృష్టిని ఆకర్షిస్తోంది! బ్యాంక్, ఎక్స్​ఛేంజ్ బెనిఫిట్స్​ని కలిపి చూస్తే, ఈ ఫోన్‌ను ఇప్పుడు రూ. 70,000 కంటే తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. వివరాల్లోకి వెళితే..

లిస్టింగ్ ధర: ఈ సేల్ సమయంలో, 128జీబీ స్టోరేజ్​తో కూడిన ఐఫోన్ 16 ప్రో ప్రారంభ ధర రూ. 1,09,900గా లిస్ట్ అయ్యింది.

బ్యాంక్ డిస్కౌంట్: ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో చెల్లించే కొనుగోలుదారులకు తక్షణమే రూ. 4,000 తగ్గింపు లభిస్తుంది.

ఎక్స్​ఛేంజ్ బోనస్: దీనికి అదనంగా, యూజర్ పాత ఫోన్, దాని కండిషన్, పిన్‌క...