భారతదేశం, ఆగస్టు 11 -- ఈ సంవత్సరం యాపిల్ తమ సరసమైన ఫ్లాగ్‌షిప్ ఫోన్ ఐఫోన్ 16ఈని భారతదేశంలో కొన్ని ఆకర్షణీయమైన ఫీచర్లతో విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ మిడ్-రేంజ్ మార్కెట్‌లో మంచి ప్రజాదరణ పొందినప్పటికీ, దాని సింగిల్-లెన్స్ కెమెరా, పాత ఐఫోన్ డిజైన్ కస్టమర్స్​లో కొంత గందరగోళాన్ని సృష్టించాయి.

మరోవైపు, కొన్ని ఆండ్రాయిడ్ ఫోన్‌లు వాటి పనితీరు, కెమెరా సామర్థ్యాలు, బ్యాటరీ లైఫ్‌తో అంచనాలను పెంచాయి. అటువంటి వాటిలో ఇటీవలే విడుదలైన ఒప్పో రెనో 14 ప్రో 5G ఒకటి! ఈ స్మార్ట్‌ఫోన్ ఆకట్టుకునే కెమెరా ఫీచర్లు, సమర్థవంతమైన పనితీరును అందిస్తుంది. ఈ రెండు ఫోన్‌లలో ఏది కొనడం మంచిదో తెలుసుకోవడానికి, ఐఫోన్ 16ఈ- ఒప్పో రెనో 14 ప్రో 5జీని పోల్చి చూద్దాము..

ఒప్పో రెనో 14 ప్రో 5జీ వెనుక భాగంలో రంగులు మారే ఈక వంటి టెక్చర్‌తో కూడిన ప్రీమియం డిజైన్, అల్యూమినియం ఫ్రేమ్‌...