భారతదేశం, డిసెంబర్ 10 -- యాపిల్​ సంస్థ ఐఫోన్ వినియోగదారుల కోసం తమ తదుపరి ప్రధాన అప్‌డేట్ అయిన ఐఓఎస్ 26.2ను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఈ వారంలోనే ఈ అప్‌డేట్ ఐఫోన్​ యూజర్స్​ అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. యాపిల్ ఇప్పటికే బీటా టెస్టర్‌లకు రిలీజ్ కాండిడేట్ (ఆర్​సీ) వెర్షన్‌ను షేర్​ చేసిందని పలు నివేదికలు సూచిస్తున్నాయి. అంటే అప్‌డేట్ కూడా త్వరలోనే లాంచ్​ అవుతుందని అర్థం.

సాధారణంగా, ఆర్​సీ (రిలీజ్ కాండిడేట్) వెర్షన్ అనేది ప్రజలకు విడుదల చేసే ముందు ఉండే ఫైనల్​ సాఫ్ట్‌వేర్ వెర్షన్‌గా పరిగణిస్తారు. గత వారం, యాపిల్ ఐఓఎస్ 26.2 ఆర్​సీ బిల్డ్‌ను బీటా టెస్టర్‌లకు అందుబాటులో ఉంచింది.

ప్రముఖ లీక్‌స్టర్ ఒకరు ఎక్స్​ ప్లాట్‌ఫామ్‌లో ఐఓఎస్, ఐప్యాడ్ఓఎస్ 26.2 కోసం 23సీ52, 23సీ54 బిల్డ్ నంబర్‌లను పంచుకున్నారు. మొదటి ఆర్​సీ బిల్డ్ నంబర్ 23సీ52గా ...