భారతదేశం, ఆగస్టు 11 -- నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్​ఎస్​డీఎల్​) షేర్లు స్టాక్ మార్కెట్‌లో ప్రవేశించిన నాటి నుంచి మంచి లాభాలతో దూసుకెళుతున్నాయి. ఆగస్ట్​ 6న మార్కెట్​లో లిస్ట్ అయిన ఈ ఎన్​ఎస్​డీఎల్​ స్టాక్​.. సోమవారం (ఆగస్టు 11) ఇంట్రాడే ట్రేడింగ్‌లో మరో 9.6% పెరిగి కొత్త గరిష్ఠ స్థాయికి చేరుకుంది. అనంతరం కాస్త కూల్​-ఆఫ్​ అయ్యింది. వరుసగా నాలుగో రోజు కూడా లాభాల బాటలో కొనసాగిన ఈ షేర్​.. ఐపీఓలో పెట్టుబడి పెట్టిన వారికి ఏకంగా 78% లాభాలను అందించింది! మరి ఈ స్టాక్​ని ఇప్పుడు కొనొచ్చా? నిపుణులు ఏమంటున్నారంటే..

ఎన్​ఎస్​డీఎల్​ షేర్లు గత వారం సానుకూల ప్రారంభాన్ని నమోదు చేశాయి. బీఎస్‌ఈలో ఈ షేర్ రూ. 800 ఇష్యూ ధరతో పోలిస్తే 10% అధికంగా రూ. 880 వద్ద ఓపెన్ అయింది. లిస్టింగ్ రోజు ముగిసే సమయానికి ఇది రూ. 936 వద్ద స్థిరపడింది, ఇది ఐపీఓ ధర కంట...