భారతదేశం, మే 13 -- ఆంధ్రప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన ఐపీఎస్‌, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారుల మధ్య నెలకొన్న కుటుంబ వివాదంపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. బహుమతిగా ఇచ్చిన ఆస్తిని వెనక్కి తీసుకుంటూ ఆర్డీఓ జారీ చేసిన ఉత్తర్వులు తెలంగాణ హైకోర్టు కొట్టేసింది.

ఏపీ క్యాడర్‌లో డీజీ ర్యాంకులో ఉన్న పీవీ సునీల్‌ కుమార్‌‌కు,రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి పి.వి.రమేష్‌ కుటుంబానికి మధ్య నెలకొన్న ఆస్తి వివాదంపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.

పీవీ సునీల్‌కు అతని భార్యకు మధ్య కొనసాగుతున్న వైవాహిక వివాదాల నేపథ్యంలో ఇరు కుటుంబాల మధ్య ఆస్తి తగాదాలు మొదలయ్యాయి. పీవీ సునీల్ మామ.. పి. సుబ్బారావుకు చెందిన ఆస్తిని మనుమడి పేరిట 2019 డిసెంబర్‌లో గిఫ్ట్‌ డీడ్ చేశారు. ఈ క్రమంలో పీవీ సునీల్‌‌కు భార్య కుటుంబ వివాదాలతో ఆస్తి వివాదం తలెత్తింది. పీవీ సునీల్‌...