భారతదేశం, నవంబర్ 7 -- ధోనీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. ఎట్టకేలకు దీనిపై చెన్నై సూపర్ కింగ్స్ నుంచి అధికారిక ధృవీకరణ వచ్చేసింది. సీఎస్కే టీమ్‌ తరఫున రాబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 ఎడిషన్‌లో ఎమ్మెస్ ధోనీ ఆడనున్నాడు. ఈ విషయాన్ని ధోనీ తమకు తెలియజేశాడని ఆ ఫ్రాంఛైజీ సీఈవో కాశీ విశ్వనాథన్ స్వయంగా ధృవీకరించారు. "ఎంఎస్ ధోనీ తదుపరి సీజన్‌కు తాను అందుబాటులో ఉంటానని మాకు చెప్పారు" అని కాశీ విశ్వనాథన్ Cricbuzzతో మాట్లాడుతూ పేర్కొన్నారు.

ఐపీఎల్ 2025లో తొలిసారిగా చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. ఆ సీజన్‌లో రెగ్యులర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మధ్యలోనే టోర్నీ నుంచి తప్పుకోవడంతో.. ధోనీ స్వయంగా కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాల్సి వచ్చింది. అయితే ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీ గెలిపించిన ఈ వికెట్ కీపర్-బ్యాటర్, జట్టు అద...