భారతదేశం, ఏప్రిల్ 22 -- ఐపీఎల్ 2025లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు హాట్ టాపిక్ గా మారాయి. లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ ను రాజస్థాన్ రాయల్స్ ఫిక్సింగ్ చేసిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ వ్యాఖ్యలను రాజస్థాన్ క్రికెట్ సంఘం (ఆర్సీఏ) అధికార కమిటీ కన్వీనర్, బీజేపీ ఎమ్మెల్యే జైదీప్ బిహానీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సీజన్ లో లక్నో చేతిలో రాజస్థాన్ కావాలనే ఓడిందనేలా ఆయన కామెంట్లు ఉన్నాయి.

ఏప్రిల్ 19న లక్నో సూపర్ జెయింట్స్ తో రాజస్థాన్ రాయల్స్ తలపడింది. ఈ ఐపీఎల్ 2025 మ్యాచ్ లో రాజస్థాన్ తరపున అరంగేట్రం చేసిన 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ రికార్డు నమోదు చేశాడు. యశస్వి జైస్వాల్ (74), రియాన్ పరాగ్ (39) రాణించడంతో 181 పరుగుల ఛేదనలో 17 ఓవర్లకు రాజస్థాన్ 156/2తో నిలిచింది.

18 బంతుల్లో 25 పరుగులు కావాల్సి ఉండగా.. చేతిలో ఎనిమిది వికెట్లతో ఉన్న రాజస్థాన్ ఈజీ...